Mon Dec 23 2024 05:55:41 GMT+0000 (Coordinated Universal Time)
Inida vs pak : బెట్టింగ్ లలో హాట్ ఫేవరెట్ గా ఇండియా
భారత్ - పాక్ మ్యాచ్ పై భారీ బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ లు ప్రారంభమయ్యాయి.
భారత్ - పాక్ మ్యాచ్ పై భారీ బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ లు ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం ఆసియా కప్ లో భాగంగా ఇండియా - పాకిస్థాన్ టీ 20 మ్యాచ్ జరుగుతుంది. అనేక ఆన్ లైన్ సైట్లలో బెట్టింగ్ లు మొదలయ్యాయి. విరాట్ కొహ్లి మీద ఎక్కువగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. బెట్టింగ్ రాయుళ్లంతా విరాట్ కొహ్లి పైనే ఎక్కువగా పెడుతున్నారు. వెయ్యికి రెండు వేల రూపాయల వరకూ బెట్టింగ్ సైట్లు ప్రకటిస్తున్నాయి. ఈ సైట్లన్నీ ఇండియా నుంచి కాకుండా విదేశాల నుంచి నడుస్తున్నాయి.
బెట్టింగ్ లు ఇలా...
ఏ ప్లేయర్ ఎన్ని రన్స్ చేస్తారు? టాప్ స్కోరర్ ఎవరు? అత్యధిక వికెట్లు తీసేది ఎవరు?ఏ ఓవర్లో ఎనరు ఎన్ని రన్స్ చేస్తారు? ట్యాస్ గెలిచేది ఎవరు? అంటూ ఆన్ లైన్ లో బెట్టింగ్ లు ప్రారంభమయ్యాయి. విరాట్ కొహ్లి హాఫ్ సెంచరీ చేస్తే వెయ్యికి రెండు వేల రూపాయలు ఇస్తామని ప్రకటించాయి. టాస్, మ్యాచ్ రెండూ భారత్ గెలిస్తే వెయ్యికి ఐదువేల రూపాయలు ఇస్తామంటున్నాయి. సూపర్ ఓవర్ కనుక వస్తే వెయ్యికి పదహారు వేలు ఇస్తామని ఆన్ లైన్ లో బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఇండియాలో బెట్గింగ్ లపై నిషేధం ఉంది. పోలీసులు నిఘాను విస్తృతం చేశారు. ఎక్కడ బెట్టింగ్ జరిగినట్లు తేలినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
Next Story