Mon Dec 23 2024 05:28:19 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్ లో భారీ సైబర్ క్రైమ్.. 175 కోట్లు విదేశాలకు తరలింపు
హైదరాబాద్ లో భారీ సైబర్ నేరం జరిగింది. పాతబస్తీలోని ఒక బ్యాంక్ నుంచి 175 కోట్లను విదేశాలకు పంపారు
హైదరాబాద్ లో భారీ సైబర్ నేరం జరిగింది. పాతబస్తీలోని ఒక బ్యాంక్ నుంచి 175 కోట్లను విదేశాలకు పంపారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చిన డబ్బులకు ఆశపడి హైదరాబాద్ లోని ఇద్దరు ఆటో డ్రైవర్లు సైబర్ నేరగాళ్లకు సహకరించారు. జాతీయ బ్యాంక్ అకౌంట్లో వీరు ఆరు అకౌంట్లను తెరిచారు. ఈ బ్యాంకు ఖాతాల నుంచి దుబాయ్, కంబోడియా, ఇండోనేసియాలకు క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు పంపారు.
ఇద్దరు ఆటో డ్రైవర్లను...
బ్యాంకుల నుంచి డబ్బులు డ్రాచేసి హవాలా, మనీలాండరింగ్ ద్వారా నిధులు పంపారు. సైబర్ నేరగాళ్ల వెనక చైనాకు చెందిన కొందరి హస్తం ఉందని అనుమానిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఆరు వందల కంపెనీలను లింక్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
Next Story