Sat Apr 26 2025 05:41:12 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్లో భారీ గా డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్లో భారీ గా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 1800 కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు

గుజరాత్లో భారీ గా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 1800 కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, భారత తీర గస్తీ దళం చేపట్టింది. గుజరాత్ సముద్ర తీర ప్రాంతంలో తరచూ విదేశాల నుంచి పెద్దయెత్తున డ్రగ్స వస్తున్నాయని తెలిసి నిఘా ఉంచారు.
నిరంతరం నిఘా...
నిరంతరం నిఘా పెట్టడమే కాకుండా సమాచార వ్యవస్థను కూడా ప్రత్యేకంగా రూపొందించుకున్నారు. అందిన సమాచారం మేరకు దాడులు చేస్తూ పోర్టుల్లోనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. గతంలోనూ కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా పద్దెనిమిది వందల కోట్ల విలువైన డ్రగ్స్ ను వదలి స్మగ్లర్లు పారిపోయే ముందు అరేబియా సముద్రంలో పడేసినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్ మెథాంఫేటమిన్గా అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story