Sun Dec 22 2024 22:19:50 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : చత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్.. పదుల సంఖ్యలో మావోలు మృతి
చత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
చత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో పద్దెనిమిది మంది మావోయిస్టుల మరణించినట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. పదిమంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు.
కొనసాగుతున్న...
ఇంకా మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో ఛత్తీస్గడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారంపై భద్రతాదళాలు జల్లెడపడుతున్నాయి. తరచూ జరుగుతున్న ఎన్కౌంటర్లలో మావోలు మృతి చెందుతున్నారు. దీంతో మావోలు కూడా నిన్న పోలీస్ బేస్ క్యాంప్ పై బాంబులు విసిరారు. దీంతో భద్రతాదళాలు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఎన్కౌంటర్ లో పద్దెనిమిది మంది మావోయిస్టులు మరణించారని, వారిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Next Story