Sun Dec 22 2024 17:11:51 GMT+0000 (Coordinated Universal Time)
Encounter : ఛత్తీస్గడ్ లో భారీ ఎన్ కౌంటర్.. 8 మంది మావోల మృతి
ఛత్తీస్గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు
ఛత్తీస్గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారని తెలిసింది. సెమ్రా ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులున్నారన్న సమచారంతో భద్రతాదళాలు అక్కడికి వెళ్లగా మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు ప్రారంభమయినట్లు చెబుతున్నారు.
ఆయుధాలను...
పోలీసు బలగాలకు, మావోయిస్టులకు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మావోలు మరణించారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కూడా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అక్కడి నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఇంకా ఉద్రికత్త కొనసాగుతుంది.
Next Story