Mon Dec 23 2024 07:47:22 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
గుర్తు తెలియని వ్యక్తులు.. ఒక టెండ్ హౌస్, రెండు గోనెసంచుల గోడౌన్లకు నిప్పంటించారు. దాంతో మంటలు చుట్టుపక్కలంతా..
కాకినాడ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. అప్పటి వరకూ ఎంతో ప్రశాంతంగా, చల్లగా ఉన్న వాతావరణంలో ఉన్నట్టుండి అలజడి రేగింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో.. నిద్రమత్తులో ఉన్న ప్రజలు భయాందోళలకు గురయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా..వారు ఘటనా ప్రాంతానికి చేరి మంటలను ఆర్పివేశారు. గొల్లప్రోలులో జరిగిన ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గుర్తు తెలియని వ్యక్తులు.. ఒక టెండ్ హౌస్, రెండు గోనెసంచుల గోడౌన్లకు నిప్పంటించారు. దాంతో మంటలు చుట్టుపక్కలంతా వ్యాపించి భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల వరకూ ఆస్తినష్టం జరిగి ఉంటుదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడింది ఎవరు ? ఎందుకు ఇలా చేశారు అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story