Sat Jan 11 2025 08:51:32 GMT+0000 (Coordinated Universal Time)
ఐటీ అధికారుల ముసుగులో భారీ చోరీ
మోండామార్కెట్ లో ఉన్న హర్ష జ్యువెలరీస్ దుకాణంలో శనివారం (మే27) జరిగిందీ ఘటన. దుకాణ యజమానులు..
హైదరాబాద్ నగరంలోని మోండా మార్కెట్ లో భారీ చోరీ జరిగింది. ఐటీ అధికారులమంటూ ఓ జ్యువెల్లరీ షాపుకు వెళ్లిన వ్యక్తులు రెండున్నర కిలోల బంగారంతో ఉడాయించారు. మోండామార్కెట్ లో ఉన్న హర్ష జ్యువెలరీస్ దుకాణంలో శనివారం (మే27) జరిగిందీ ఘటన. దుకాణ యజమానులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖ అధికారులమంటూ మోండా మార్కెట్లోని హర్ష జ్యువెల్లరీస్ షాపులోకి వచ్చారు.
షాపులో తనిఖీలు నిర్వహించాలంటూ బంగారం నగలు తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని షాపు యజమానులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇటీవల కాలంలో ప్రభుత్వ అధికారులమని, పోలీసులమని చెప్పి డబ్బు, నగలు దోచుకుని ఉడాయిస్తున్నారు. ఇలా ఎవరైనా ఇంటికి లేదా షాపులకు వస్తే నమ్మొద్దని పోలీసులు సూచించారు.
Next Story