Mon Dec 23 2024 02:53:35 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : న్యూఇయర్ వేడుకలకు ముందు.... 3.14 కోట్ల విలువైన మత్తు పదార్థాల స్వాధీనం
హైదరాబాద్ లో భారీగా మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆల్పా జోలం ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ లో భారీగా మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆల్పా జోలం ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 70 కిలోల మేరకు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేజీ ఆల్ఫ్రా జోం 2.5 లక్షలకు కొనుగోలు చేసి కస్టమర్లకు 3.5 లక్షలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నరసింహ గౌడ్ తో పాటు పోలీసులు అతడి కొడుకు రాజశేఖర్ ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేజీల కొద్దీ...
మొత్తం 3.14 కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గచ్చిబౌలికి చెందిన నరసింహ కీలక సూత్రధారిగా గుర్తించారు. హైదరాబాద్ లో ప్రతి నెల నలభై కేజీల వరకూ విక్రయిస్తున్నట్లు నరసింహ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఈ ముఠా వెనక ఇంకా ఎంత మంది ఉన్నారన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్దయెత్తున మత్తు పదార్థాలను విక్రయించేందుకు వీటిని ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తీసుకు వచ్చారని పోలీసులు తెలిపారు. మొత్తం 34 కేజీల ఆల్పా జోలం ను నర్సింహ తెచ్చారంటున్నారు.
Next Story