Sun Dec 22 2024 13:28:10 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
తిరుమల రెండో ఘాట్ చివరి మలుపు వద్ద బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు భార్య భర్తలు మరణించారు
తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. తిరుమల రెండో ఘాట్ చివరి మలుపు వద్ద బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు భార్య భర్తలు మరణించారు. తిరుమల ఘాట్ రోడ్డు మలుపు వద్ద వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తలు తిరుమల దర్శనం కోసం వెళుతుండగా ప్రమాదంలో మరణించారు.
భార్యాభర్తలుగా...
వీరిద్దరూ భార్యాభర్తలుగా గుర్తించారు. తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం జిరిగింది. బస్సు కింద మృతదేహాలు ఇరుక్కుపోవడంతో క్రేన్ సాయంతో వాటిని తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతులు తమిళనాడుకు చెందిన భార్యాభర్తలుగా గుర్తించినట్లు తెలిపారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story