Mon Dec 23 2024 10:14:17 GMT+0000 (Coordinated Universal Time)
ఛీ..ఇదేం బుద్ధి..సర్పంచ్ తో రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇద్దరినీ రోడ్డు మీదకు తీసుకొచ్చి చితకబాదాడు.
నిండు నూరేళ్లు నీతోనే కలిసి ఉంటానని పెళ్లి నాడు చేసిన ప్రమాణాలు నీళ్లకొదిలి.. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ.. తమ సంసారాలను తామే కూల్చుకుంటున్నారు. దంపతుల్లో ఎవరో ఒకరు ఇలాంటి సంబంధాలు పెట్టుకుని.. కుటుంబ పరువుల్ని రోడ్డుకి ఈడుస్తున్నారు. ఒక్కోసారి ఆ మోజులో పడి.. హంతకులయ్యేందుకు కూడా వెనుకాడట్లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి.. తన భార్య మరో మగాడితో హోటల్ గదిలో ఉండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.
ఆ తర్వాత తన భార్యతో పాటు ప్రియుడిని బయటికి తీసుకొచ్చి నడిరోడ్డులో చితక్కొట్టాడు. మహరాజ్ గంజ్ లో హోటల్ గదిలో తన ప్రియుడితో ఉన్న భార్యను.. ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇద్దరినీ రోడ్డు మీదకు తీసుకొచ్చి చితకబాదాడు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించాడు. ట్విస్ట్ ఏంటంటే తన భార్య ప్రియుడు తమ ఊరి సర్పంచ్ కావడమే. తన భార్య రోజూ ఇల్లు వదిలి, హోటల్ కి వచ్చి ప్రియుడితో గడుపుతోందని తెలిసి.. మూడ్రోజులుగా తన స్నేహితులతో నిఘా పెట్టించానని, దీంతో వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని భర్త తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. బంగారం లాంటి భర్త ఉండగా.. ఇదేం పాడుబుద్ధి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Next Story