Mon Dec 23 2024 09:02:27 GMT+0000 (Coordinated Universal Time)
భార్య బోనాలకు రాలేదని అలిగిన భర్త.. వీడియో కాల్ లో మాట్లాడుతూనే ..
ఆగస్టు 14 ఆదివారం మీర్ పేట్ లో ఉన్న కార్తీక్ బంధువుల ఇంట్లో బోనాల పండుగ జరిగింది. తన పిన్ని ఇంట్లో బోనాల పండుగకు..
చిన్న చిన్న విషయాలకు, కూర్చుని మాట్లాడుకుంటే సర్దుబాటయ్యే సమస్యలను బూతద్దంలో చూస్తూ.. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తన బంధువుల ఇంట్లో బోనాల పండుగకు భార్య రాలేదని అలిగిన భర్త.. ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తుక్కుగూడకు చెందిన సాయికార్తీక్ గౌడ్ (33) తన భార్య రవళితో కందుకూరు మండలం బేగంపేటలో ఆగస్టు 12న భార్య బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి వెళ్లాడు. భార్యను అక్కడే వదిలి శనివారం కార్తీక్ ఇంటికి వచ్చాడు. ఆగస్టు 14 ఆదివారం మీర్ పేట్ లో ఉన్న కార్తీక్ బంధువుల ఇంట్లో బోనాల పండుగ జరిగింది. తన పిన్ని ఇంట్లో బోనాల పండుగకు వెళ్దామని, వెంటనే ఇంటికి రావాలని భార్యకు ఫోన్ చేశాడు.
కానీ.. ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిచినా.. కార్తీక్ మాటను రవళి పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన కార్తీక్ భార్యకు వీడియో కాల్ చేసి ఆవేదన చెందాడు. నీ తరపు బంధువుల అన్ని ఫంక్షన్లకు నీతోపాటు నేనూ వస్తున్నా.. నువ్వు మాత్రం మా వైపు ఫంక్షన్లకు ఎందుకు రావట్లేదని అడుగుతూనే ఇంట్లో దూలానికి ఉరివేసుకున్నాడు. వీడియో కాల్ లో కార్తీక్ సూసైడ్ చేసుకోవడాన్ని చూసిన రవళి.. వెంటనే పక్కింటి వారికి ఫోన్ చేసి తన భర్తను కాపాడాలని చెప్పి.. ఇంటికి బయల్దేరింది. రవళి ఇంటికి వచ్చేసరికే కార్తీక్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
Next Story