Sun Dec 22 2024 12:22:32 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లాం ముక్కుకోసి జేబులో వేసుకుని పరుగో.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం శనివారం (జులై 1) రాత్రి 8 గంటల సమయంలో విక్రమ్ వంట చేయాలని కోరాడు. ఈ క్రమంలో..
ఓ భర్త తన భార్య ముక్కు కోసి.. దానిని జేబులో వేసుకుని పరుగు లంకించాడో భర్త. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగింది. నిందితుడి భార్య.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న భర్త కోసం గాలించి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బన్ స్తలి గ్రామానికి చెందిన విక్రమ్ కు మహ్మదాబాద్ గ్రామానికి చెందిన సీమా దేవితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయ్యాక వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లల్ని కన్నాక మనోడి బుద్ధి వక్రించింది. గ్రామంలో మరో మహిళపై మోజుపడ్డాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం సీమాకు తెలియడంతో.. ఇదేం పని అంటూ నిలదీసింది. ఈ విషయమై తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం శనివారం (జులై 1) రాత్రి 8 గంటల సమయంలో విక్రమ్ వంట చేయాలని కోరాడు. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య మహిళతో సంబంధంపై గొడవ జరిగింది. కోపంతో కూతురిని కొట్టడంతో.. సీమ అతడిని అడ్డుకోగా.. ఆమె ముక్కును కోసి.. జేబులో పెట్టుకుని అక్కడి నుండి పరారయ్యాడు. తీవ్రరక్తస్రావం అయిన సీమ.. ముక్కుకి క్లాత్ అడ్డం పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. విక్రమ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీమాదేవిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. నిందితుడిని వెతికి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. కోర్టు రిమాండ్ విధించింది. ప్రియురాలి కోసం భార్య ముక్కును కోసి పరారవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Next Story