Sat Dec 21 2024 13:54:53 GMT+0000 (Coordinated Universal Time)
మృత్యువు ఇలా కూడా వచ్చేయొచ్చు
చికత్స కోసం ఆసుపత్రికి వచ్చిన దంపతులపై చెట్టు విరిగిపడటంతో భర్త మరణించాడు
మృత్యువు ఎప్పుడు? ఎలా? ముంచుకొస్తుందో తెలియదు. మనకు తెలియకుండానే దాని ఒడిలో ఒదిగిపోవాల్సిన పరిస్థిితి వస్తుంది. అందుకు తాజా ఉదాహరణ బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో జరిగిన ఘటనే ఉదాహరణ అని చెప్పాలి. చికిత్స నిమిత్తం బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రికి దంపతులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి వస్తుండగా ఒక చెట్టు విరిగి వారిపై పడింది.
భర్త మరణించగా...
ఈ ప్రమాదంలో భర్త రవీందర్ అక్కడికక్కడే మరణించారు. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో కనిపించాయి. సరళాదేవిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సరళాదేవి టీచర్ గా పనిచేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు ఘటన స్థలికిచేరుకుని కేసు నమోదు చేశారు.
Next Story