Mon Dec 23 2024 17:01:48 GMT+0000 (Coordinated Universal Time)
అత్తింటి వేధింపులు తాళలేక.. భర్త ఆత్మహత్య
ఈ విషయమై వెంకట్ - కల్యాణిల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో రెండునెలల క్రితం భార్య వరంగల్ లో ఉన్న పుట్టింటికి వెళ్లింది.
సాధారణంగా అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య, భార్య బలవన్మరణం.. ఇలాంటి వార్తలు చదువుతుంటాం. కానీ.. ఇక్కడ భార్య, అత్తమామల వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుషాయిగూడలోని పోచమ్మగుడి వద్ద మొలుగు వెంకట్ రెడ్డి(38) తల్లి, భార్య కల్యాణి, ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తున్నాయి. వెంకట్ రెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా.. అతని తల్లితో కలిసి ఉండటం భార్య, అత్తమామలకు ఇష్టం లేదు. దాంతో వారిని వేరుకాపురం పెట్టాలని నిత్యం వేధించేవారు.
ఈ విషయమై వెంకట్ - కల్యాణిల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో రెండునెలల క్రితం భార్య వరంగల్ లో ఉన్న పుట్టింటికి వెళ్లింది. జులై 2న తన తల్లిదండ్రులతో కుషాయిగూడకు వచ్చిన కల్యాణి వేరుకాపురంపై నానా రభస చేసింది. వెంటనే ఇంట్లో నుండి అతడి తల్లిని పంపేయాలని పట్టుబట్టింది. పైగా ఆస్తిని పిల్లలపేర్లుపై రాయాలని ఒత్తిడి చేసింది. పరువుపోతుందని, ఒత్తిడి చేయొద్దని వెంకట్ రెడ్డి చెప్పినా వినలేదు. చచ్చేవాడివేనా నువ్వు.. డ్రామాలాడకు అంటూ హేళన చేశారు అత్తింటివారు.
తీవ్రమనస్తాపానికి గురైన వెంకట్ రెడ్డి అరేరోజు రాత్రి పురుగులమందు తాి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన అతని తల్లి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ వెంకట్ రెడ్డి బుధవారం మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపి దర్యాప్తు చేస్తున్నారు. వెంకట్ రెడ్డి భార్య, ఆమె తల్లిదండ్రులను విచారిస్తున్నారు.
Next Story