Mon Dec 23 2024 18:45:39 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు.. తీరా చూస్తే..
బోరబండకు చెందిన మహిళ (26) ఓ ఆస్పత్రిలో పనిచేస్తోంది. నిఖిల్ (25) అనే యువకుడు సదరు యువతిని ప్రేమిస్తున్నానంటూ..
నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు. నువ్వు లేకుండా ఉండలేనన్నాడు. అతడి మాటలకు, చూపించే ప్రేమకు ఆమె చలించిపోయింది. లవ్ కు యస్ చెప్పి.. అతనితో కలిసి జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమైంది. జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాతే.. తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పటి వీడియోలను తీసి.. డబ్బుల కోసం బెదిరించడం మొదలు పెట్టాడు. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో జరిగిందీ ఘటన.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. బోరబండకు చెందిన మహిళ (26) ఓ ఆస్పత్రిలో పనిచేస్తోంది. నిఖిల్ (25) అనే యువకుడు సదరు యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. గతేడాది నవంబరులో పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రేమవివాహం చేసుకున్నారు. అనంతరం మూడునెలలపాటు ఎవరింట్లో వారు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భార్యభర్తలుగా కలిసి ఉంటున్నారు. ఆ తర్వాతి నుండే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.
ఏ పనీ చేయకపోగా.. మద్యానికి బానిసయ్యాడు నిఖిల్. డబ్బుల కోసం తరచూ భార్యను వేధించసాగాడు. ఈ క్రమంలో ఆమె నుండి పలు విడతలుగా రూ.4 లక్షలు తీసుకున్నాడు. అయినప్పటికీ వేధింపులు ఆగలేదు. వేధింపులు శృతిమించడంతో.. విసిగిపోయిన బాధితురాలు శనివారం ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. నిఖిల్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.
Next Story