Mon Dec 23 2024 09:08:44 GMT+0000 (Coordinated Universal Time)
భార్య, అత్తను కొట్టిచంపిన వ్యక్తి
వ్యక్తిగత కారణాల వల్ల ఏడాది క్రితం ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో మహాదేవికి నెలరోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం టెక్కలికోటకు..
కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య, అత్తను అతికిరాతకంగా కర్రతో కొట్టి హతమార్చాడో వ్యక్తి. జిల్లాలోని కౌతాలం మండలంలో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలారి హనుమంతమ్మ (45), కుమార్తె మహాదేవి (25) కౌతాలం మండలం బాపురం గ్రామంలో నివాసం ఉంటున్నారు. మహాదేవి బాపురం గ్రామంలోనే వాలంటీర్ గా పనిచేస్తుంది. ఐదేళ్ల క్రితం వీరలదిన్నె గ్రామానికి చెందిన దస్తగిరితో వివాహం జరిగింది.
వ్యక్తిగత కారణాల వల్ల ఏడాది క్రితం ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో మహాదేవికి నెలరోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం టెక్కలికోటకు చెందిన బోయ రమేష్ తో రెండో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత టెక్కలికోటలోనే కాపురం ఉండాలని మహాదేవికి చెప్పాడు. ఈ విషయంలో రెండ్రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత దంపతులిద్దరూ మరోసారి గొడవపడ్డారు. కోపంలో రమేష్.. భార్య మహాదేవి, అత్త హనుమంతమ్మను కర్రతో కొట్టి దారుణంగా చంపాడు. అరుపులు విన్న చుట్టుపక్కల వారు.. మహాదేవి మేనమామ అయ్యప్పకు సమాచారం ఇచ్చారు.
ఘటనా ప్రాంతానికి వెళ్లి చూసేసరికే ఇద్దరూ మరణించి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు తరలించారు. అయ్యప్ప ఫిర్యాదు మేరకు రమేష్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story