Sun Dec 22 2024 22:47:26 GMT+0000 (Coordinated Universal Time)
బెడ్ మీద తన ప్రియుడిని హత్తుకుని భార్య.. అది చూసిన భర్త
ఆ వ్యక్తి తన భార్యను ఎంతగానో ప్రేమించాడు.. కానీ ఆ భార్య వేరొకరిని హత్తుకుని ఉండడాన్ని చూసి భరించలేకపోయాడు.
పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితులు వస్తున్నాయంటే ఏమో అనుకున్నాం.. కానీ ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు చూస్తూ ఉంటే అదే నిజమని అనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తి తన భార్యను ఎంతగానో ప్రేమించాడు.. కానీ ఆ భార్య వేరొకరిని హత్తుకుని ఉండడాన్ని చూసి భరించలేకపోయాడు. ఉరివేసుకుని ప్రాణాలు తీసేసుకున్నాడు.
బీహార్‌లోని నలంద జిల్లాలో భర్త ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.పోలీసులు మృతదేహానికి సమీపంలో సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. భర్త తన సూసైడ్ నోట్లో ఇలా రాశాడు, 'ఇంటి నుండి వెళ్లిన భార్యను తిరిగి తీసుకురావడానికి వెళ్లగా, ఆమె ప్రేమికుడిని హత్తుకుని నిద్రపోతోంది. ఈ దృశ్యాన్ని చూసి చాలా బాధపడ్డాను. బ్రతికి ప్రయోజనం లేదనిపించింది.. ఇప్పుడు ప్రాణాలను తీసుకుంటున్నాను' అని ఉంది. ఈ ఆత్మహత్య కారణంగా ఇద్దరు పిల్లలు తండ్రి లేని వారయ్యారు. నలంద జిల్లాలోని లాహేరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
చంద్రదేవ్ కుమార్ ఓ కాలనీలో ఉండేవాడు. అతను 2015 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. బంగాళదుంపలు, ఉల్లిపాయలు అమ్ముతూ ఉండేవాడు. మే 16న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహం దగ్గర నుండి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు, దానిని చదివి పోలీసులు కూడా షాక్ అయ్యారు. భార్య తన క్లాస్‌మేట్‌తో పాటు మరో యువకుడితో అక్రమ సంబంధాలు కలిగి ఉందని చంద్రదేవ్ కుమార్ సూసైడ్ నోట్ లో చెప్పుకొచ్చాడు. భార్యను మార్చాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పిల్లలు పుట్టాక కూడా ప్రియుడితోనే ఉండాలనుకుంది. అందుకే ప్రాణాలను తీసుకుంటున్నాను. మే 8న ప్రేమికుడిని కలవడానికి భార్య ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆ తర్వాత నేను ఆమె దగ్గరకు వెళ్లగా.. తన ప్రేమికుడితో అభ్యంతరకర స్థితిలో కనిపించింది. ఆ తర్వాత నా జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నానని సూసైడ్ నోట్ లో చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా లాహేరి ఎస్‌హెచ్‌వో సుబోధ్‌కుమార్ మాట్లాడుతూ చంద్రదేవ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని, మిగిలిన నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story