Thu Dec 19 2024 16:46:10 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ట్స్ కాలేజీలో మహిళా లెక్చరర్ గొంతుకోసిన భర్త
సుమంగళి అనే మహిళ ఆ కాలజీలో కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తోంది. ఎప్పటిలాగే కాలేజీకి వచ్చిన సుమంగళిపై ఆమె భర్త పరేష్..
ఏపీలో మహిళలపై దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అఘాయిత్యాలు, హత్యాయత్నాలతో రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిపోతోంది. మహిళా లెక్చరర్ పై ఆమె భర్తే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో జరిగింది. సుమంగళి అనే మహిళ ఆ కాలజీలో కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తోంది. ఎప్పటిలాగే కాలేజీకి వచ్చిన సుమంగళిపై ఆమె భర్త పరేష్ విరుచుకుపడ్డాడు. కాలేజీలోని కామర్స్ డిపార్ట్ మెంట్ భవనం వెలుపల కత్తితో దాడికి దిగడంతో, సుమంగళి గట్టిగా కేకలు వేసింది. దాంతో విద్యార్థులు, ఇతర లెక్చరర్లు పరుగున వచ్చి పరేష్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కానీ అప్పటికే అతను సుమంగళి గొంతుకోయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ఏడాది కాలంగా సుమంగళి, పరేష్ వేర్వేరుగా ఉంటున్నారని వెల్లడించారు. పరేష్ పై అతని భార్య గృహహింస కేసు పెట్టి, విడాకులు కోరుతోందని.. ఈ నేపథ్యంలోనే అతడు సుమంగళిపై దాడికి పాల్పడినట్టు తెలిపారు.
Next Story