Thu Dec 19 2024 12:41:37 GMT+0000 (Coordinated Universal Time)
జిమ్ నుండి బైక్ తీసుకోడానికి వచ్చిన రాహుల్ సింగ్.. ఇంతలో
మంగళవారం సాయంత్రం అత్తాపూర్‌లోని ఓ భవనం వద్ద 25 ఏళ్ల యువకుడిని
మంగళవారం సాయంత్రం అత్తాపూర్‌లోని ఓ భవనం వద్ద 25 ఏళ్ల యువకుడిని ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. లంగర్ హౌజ్‌లో నివాసం ఉంటున్న బాధితుడు రాహుల్ సింగ్ (30) అత్తాపూర్ రోడ్డులోని ఓ భవనం మొదటి అంతస్తులో ఉన్న జిమ్ కు వెళ్లాడు. జిమ్ లో తన వర్కౌట్ ను పూర్తి చేసిన తర్వాత, బాధితుడు తన మోటారుసైకిల్‌ను తీసుకోవడానికి సెల్లార్‌కు వచ్చాడు. ఇద్దరు వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని రాజేంద్రనగర్ ఏసీపీ బి గంగాధర్ తెలిపారు. సమాచారం అందుకున్న డీసీపీ రాజేంద్రనగర్ జగదీశ్వర్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
రాహుల్ సింగ్ హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. రాహుల్ సింగ్ ను హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహరం కూడా కారణం అయి ఉండొచ్చనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story