Mon Dec 23 2024 01:30:58 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో 'గే' చాటింగ్ మోసాలు.. ఇంత దారుణమా..!
బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్–12 ప్రాంతానికి
స్నేహితులను, కొత్తవారితోనూ కనెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు యాప్స్ వచ్చేశాయి. ఎంతో మంది ఉపయోగిస్తూ ఉన్నారు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేకంగా యాప్స్ వచ్చేశాయి. తమకు నచ్చిన కేటగిరీని ఎంచుకుంటే.. ఇష్టమైన వాళ్లను కలవచ్చు. అయితే అలా యాప్ ను నమ్ముకుని వెళ్లిన వ్యక్తులకు ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. అది కూడా హైదరాబాద్ లో..! ఆన్ లైన్ ద్వారా గే ఛాటింగ్ చేసి వారితో పరిచయం పెంచుకుని చెప్పిన చోటికి రమ్మంటారు.. తరువాత వారి బట్టలు విప్పించి నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు చిత్రీకరించడమే కాకుండా.. బెదిరింపులకు కూడా దిగారు. బాధితుల దగ్గర ఉన్నదంతా దోచేశారు. దోపిడీకి పాల్పడి గతంలో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద జైలుకెళ్లిన నిందితుడి కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్–12 ప్రాంతానికి చెందిన యువకుడు(23) ఈ నెల 1న తన గే లకు సంబంధించిన యాప్లో చాటింగ్ చేస్తుండగా అవతలి వైపు నుంచి అఫ్రిది అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కాసేపు చాటింగ్ చేసుకున్న తరువాత తన గదికి రావాలంటూ ఆఫ్రిది లొకేషన్ పంపాడు. సదరు యువకుడు ఆఫ్రిది గదికి వెళ్లగా కత్తి చూపించి న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీశాడు. బలవంతంగా అతడి చేతికి ఉన్న బ్రాస్లెట్తో పాటు గొలుసు, రూ. 2వేల నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులు లాక్కున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అక్కడి నుండి తప్పించుకుని బయటపడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆఫ్రిది ఇదే తరహాలో మరో యువకుడిని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 భోళానగర్లోని తన గదికి రప్పించాడు. అనంతరం కత్తితో బెదిరించి దుస్తులు విప్పించి నగ్న దృశ్యాలు వీడియో తీయించాడు. తన స్నేహితుడు హరున్తో కొట్టించాడు. రూ. 7వేల నగదు, బంగారు ఉంగరం లాక్కున్నాడు. ఫోన్ పే ద్వారా రూ. 20 వేలు మహ్మద్ ఉమర్ మొయినుద్దీన్ ఖాతాకు బదిలీ చేయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story