Tue Nov 05 2024 12:35:06 GMT+0000 (Coordinated Universal Time)
వివాహితపై కానిస్టేబుల్ వికృత చేష్టలు.. ఫొటోలు, వీడియోలు చూపించి అత్యాచారం
వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మీర్ పేట పరిధిలో ఉంటోన్న ఓ వివాహిత కుటుంబం గతంలో సైదాబాద్ లో నివసించేది. మాదన్నపేట పోలీస్
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ ఏదొక ప్రాంతంలో ఆడపిల్లలు, యువతులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వారిలో కొందరు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో మహిళపై దారుణం జరిగింది. రక్షణగా ఉండాల్సిన కానిస్టేబులే వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నగ్నచిత్రాలు, వీడియోలు తీసి తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ బెదిరింపులకు దిగాడు. మీర్ పేట ఠాణా పరిధిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడైన హైదరాబాద్ స్పెషల్ బ్రాంచి కానిస్టేబుల్ పి. వెంకటేశ్వర్లు (30)ను పోలీసులు ఈనెల 14న అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం మీర్ పేట పరిధిలో ఉంటోన్న ఓ వివాహిత కుటుంబం గతంలో సైదాబాద్ లో నివసించేది. మాదన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు వాళ్లింటికి సమీపంలోనే నివాసముండేవాడు. ఈ క్రమంలో అతను వివాహితతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆమె తిరస్కరించడంతో వేధింపులకు గురిచేశాడు. దాంతో బాధితురాలు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో 2021 జనవరిలో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంకటేశ్వర్లుకి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
కానీ.. వెంకటేశ్వర్లు ప్రవర్తనలో మార్పు రాకపోగా.. మరింత వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. మరోసారి బాధితురాలు మే నెలలో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడైన వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. ఆ తర్వాత బాధితురాలి కుటుంబం సికింద్రాబాద్ కు, కొన్ని నెలలకి మీర్ పేటకి ఇల్లు మారారు. ఫోన్ నంబర్ మార్చినా వేధింపులు ఆగలేదు. జైలు నుండి విడుదలయ్యాక ఆమె ఆచూకీ తెలుసుకున్నాడు.
భర్త ఇట్లోలేని సమయం చూసి ఆగస్టు 18న ఆమె ఇంటికెళ్లి.. బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్నుండి ఫొటోలు, వీడియోలు చూపిస్తూ.. తరచూ అత్యాచారం చేశాడు. ఈ నెల 14న బాధితురాలి ఇంటికెళ్లి తనపై గతంలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశాడు. వినకపోవడంతో మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. అదేరోజు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు వెంకటేశ్వర్లుని అరెస్ట్ చేశారు.
Next Story