Mon Dec 23 2024 13:36:17 GMT+0000 (Coordinated Universal Time)
HYD Crime Roundup 2022 : పెరిగిన క్రైం రేటు.. సైబర్ నేరాలతో 1500 కోట్ల సొత్తు చోరీ
అలాగే మహిళపై నేరాలకు పాల్పడిన 2524 మందిపై కేసులు నమోదయ్యాయి. వాటిలో 296 రేప్ కేసులు, 126 కిడ్నాప్ కేసులు
2022 సంవత్సరం ముగియనుంది. కొద్దిరోజుల్లో 2023 నూతన సంవత్సరం రానుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది మాదిరి.. ఈ ఏడాది కూడా నగరంలో జరిగిన నేరాలు, వాటిపై నమోదైన కేసులు, శిక్షల వివరాలను హైదరాబాద్ సీపీ ఆనంద్ వివరించారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిందన్నారు. ఆర్థిక నేరాలు, మహిళలపై నేరాలు, చీటింగ్ కేసులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 22,060 కేసులు నమోదవ్వగా.. వాటిలో 2249 సైబర్ కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయని సీపీ ఆనంద్ వివరించారు.
అలాగే మహిళపై నేరాలకు పాల్పడిన 2524 మందిపై కేసులు నమోదయ్యాయి. వాటిలో 296 రేప్ కేసులు, 126 కిడ్నాప్ కేసులు ఉన్నాయి. ఇక మహిళలపై 1418 మంది మహిళలపై వేధింపులు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆర్థిక నేరాల కేసులు భారీగా పెరిగాయని వివరించారు. ఆస్తుల దొంగతనాల కేసుల్లో 25 కోట్ల రూపాయల ప్రాపర్టీ చోరీ అవగా.. 62 శాతం రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన 949 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆర్థిక నేరగాళ్లు.. ఇళ్లు, షోరూమ్ లు, నగల దుకాణాల్లో చోరీలతో 15 వందల కోట్లకు పైగా సొత్తును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
2022లో కొత్తగా 91 మందిపై ఛార్జ్ షీట్ లు ఓపెన్ చేసినట్లు సీపీ ఆనంద్ తెలిపారు. అలాగే వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న 21 మందికి జీవితఖైదు శిక్షలు పడినట్లు చెప్పారు. 63 మర్డర్ కేసులు నమోదవ్వగా.. కొన్ని విచారణలో ఉన్నట్లు తెలిపారు. 4,297 చీటింగ్ కేసులు, 273 డ్రగ్ కేసులు, 456 గేమింగ్ కేసులు, 113 అట్రాసిటీ కేసులు నమోదైనట్లు వివరించారు. డ్రగ్స్ కేసుల్లో 1082 మందిని నిందితులుగా చేర్చామని, కొందరి విచారణలు కొనసాగుతున్నయని సీపీ చెప్పారు. వీటితో పాటు.. విద్యార్థులు, యువతీ యువకులు, వివాహితల ఆత్మహత్యలు కూడా పెరిగాయని తెలిపారు.
Next Story