Fri Dec 27 2024 09:26:38 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసులో ఆ ముప్ఫయి మంది?
హైదరాబాద్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరుగుతుంది.
హైదరాబాద్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరుగుతుంది. ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు రెండు రోజుల క్రితం పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ముఠాను విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ లో ముప్ఫయి మంది ప్రముఖులకు ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తేలింది.
ప్రముఖల పిల్లలు....
ఈ ముప్ఫయి మంది ప్రముఖుల జాబితాను రూపొందించి వారిని విచారణ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. రాజీకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖుల పిల్లలు ఈ డ్రగ్స్ ను వాడుతున్నట్లు పోలీసులు ముంబై ముఠాను విచారించగా తేలింది. వీరిలో తరచూ డ్రగ్స్ తీసుకుంటున్న దెవరు? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో ముంబయి టోనీ గ్యాంగ్ లోని మరొక ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story