Fri Dec 20 2024 11:15:53 GMT+0000 (Coordinated Universal Time)
Divya Jyothi: భార్య లంచాలకు అలవాటు పడింది.. భర్త ఏమి చేశాడంటే?
లంచం తీసుకోవడం తప్పు అని భర్త చెప్పినా ఆ భార్య
లంచాలకు బాగా అలవాటు పడిన భార్య బాగోతాన్ని ఓ భర్త బయటపెట్టి మంచితనం ఇంకా ఉందని నిరూపించాడు. ప్రతి రోజూ తన భార్య లంచాలు తీసుకోనిదే ఇంటికి రాదంటూ ఓ భర్త తన భార్య ఎక్కడెక్కడ డబ్బులు దాచిందో మొత్తం రికార్డు చేసి మరీ బయటకు వదిలాడు. మణికొండలోని కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకుంటూ భారీగా లంచాలు తీసుకువస్తుందంటూ భర్త ఆరోపించాడు.
లంచం తీసుకోవడం తప్పు అని భర్త చెప్పినా ఆ భార్య వినలేదట. అందుకే చివరికి వీడియో తీసి పోస్టు చేశాడు. ఎక్కడెక్కడ డబ్బును దాచింది, ఏ ఏ కవర్లలో డబ్బులను ఉంచింది అన్నది వీడియోలో చూపించాడు ఆ భర్త. లంచం తీసుకుంటున్న భార్యను భర్త శ్రీపాద్ పట్టించాడు. మనికొండ మున్సిపల్ డీఈఈగా దివ్యజ్యోతి పని చేస్తున్నారని, పెద్ద లంచగొండి అంటూ భర్త శ్రీపాద్ తెలిపారు. ప్రతి రోజు తన భార్య దివ్యజ్యోతి అక్రమంగా లక్షలలో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుందని వివరించారు. నువ్వు తప్పు చేస్తున్నావ్ అంటూ తాను ప్రశ్నిస్తే, తనను తిట్టేదని వీడియో భర్త తెలిపాడు. దివ్య జ్యోతిపై అవినీతి ఆరోపణలు ఇటీవల వచ్చాయి. ఇప్పుడు భర్త ఏకంగా సాక్ష్యాలను బయట పెట్టి ఆమెకు షాక్ ఇచ్చాడు. ఈ ఉదంతంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story