Sun Dec 22 2024 23:43:56 GMT+0000 (Coordinated Universal Time)
జీహెచ్ఎంసీ కార్మికురాలిని కబళించిన మృత్యువు
హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు
హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికురాలు సునీత కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్రం చేస్తూ ఉండగా.. వేగంగా దూసుకొచ్చిన అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ బస్సు అదుపుతప్పి ఆమెను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను తోటి సిబ్బంది వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న నలుగురు విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి. మొయినాబాద్‌లోని అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్తుండగా ఈ ఘటన చేసుకుంది. ఈ ప్రమాదంతో ఉదయం ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. నారాయణగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్ మహ్మద్ గౌస్ ను అరెస్టు చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడని కేసు నమోదు చేశారు.
Next Story