ప్రైవేట్ పార్ట్ కోసుకుని వైద్య విద్యార్థి ఆత్మహత్య
అతడిని ఇంట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మందులు తీసుకోవాల్
సికింద్రాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న దీక్షిత్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లోనే దీక్షిత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీసులు మాట్లాడుతూ అతనికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు సోమిరెడ్డి, కరుణ. వీరిది ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరుప్పుల గ్రామం. వారు అక్కడి నుంచి 20 ఏళ్ల క్రితం హైదరాబాదు శివారులోని పాపిరెడ్డి నగర్ కి వచ్చి ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు దీక్షిత్ రెడ్డి మెడిసిన్ చదువుతున్నాడు. దీక్షిత్ రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదు. గతంలో కూడా ఒకసారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.