Wed Nov 20 2024 01:43:10 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి.. ఐదుగురు అరెస్ట్
నల్లకుంట శివమ్ రోడ్డులో ఉంటున్న ప్రేమ్ ఉదయ్ కుమార్ అనే యువకుడు రియల్ ఎస్టేట్ చేస్తుండేవాడు. ఇటీవల అతను శ్రీరామ్ అనే..
హైదరాబాద్ : అతిగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఓ యువకుడు మృతి చెందినట్లు లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరించారు. డ్రగ్స్ తీసుకుని చనిపోయిన ఘటనలో హైదరాబాద్ లో ఇదే మొదటి కేసు అని ఆయన వివరించారు. నగరంలోని నల్లకుంట శివమ్ రోడ్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరాలు వెల్లడించారు.
నల్లకుంట శివమ్ రోడ్డులో ఉంటున్న ప్రేమ్ ఉదయ్ కుమార్ అనే యువకుడు రియల్ ఎస్టేట్ చేస్తుండేవాడు. ఇటీవల అతను శ్రీరామ్ అనే యువకుడితో కలిసి డ్రగ్స్ దందా మొదలు పెట్టాడు. ప్రేమ్ వద్ద నుంచి రామకృష్ణ, జీవన్ రెడ్డి, నిఖిల్ జోషూవ్ అనే కొందరు యువకులు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీరామ్, ప్రేమ్ కలిసి సొంతంగా డ్రగ్స్ తయారు చేయడం మొదలు పెట్టారని, కెమికల్ ప్రాసెస్ ద్వారా డ్రగ్స్ తయారీకి అమెజాన్ లాంటి కొరియర్ సర్వీసులను ఉపయోగించుకున్నట్లు ఏసీపీ డీఎస్ చౌహన్ వివరించారు. శ్రీరామ్ డ్రగ్స్ తయారీలో ఎక్స్పర్ట్. అతనొక ఇల్లీగల్ డ్రగ్ ప్రొడక్ట్ ను తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అలా వీళ్లు తయారు చేసిన డ్రగ్స్ ను తీసుకున్న వ్యక్తి మరణించాడని తెలిపారు. మరణించిన యువకుడు డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమ్ స్నేహితుడిగా పోలీసులు పేర్కొన్నారు. మరణించిన వ్యక్తి గోవాలో పలు రకాల డ్రగ్స్ తీసుకోగా..అనారోగ్యానికి గురై వారం రోజుల్లోనే మృతి చెందాడని డీఎస్ చౌహన్ పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగదారులు రామకృష్ణ, జీవన్ రెడ్డి, నిఖిల్ జోషూవ్, లను అరెస్ట్ చేసామని, డ్రగ్స్ ప్రధాన సూత్రధారి అయిన లక్ష్మీపతిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితుల వద్ద నుంచి నిందితుల నుంచి LSD 6 బాటిల్స్, ఎక్స్టెసీ పిల్స్ 10 , హాష్ ఆయిల్ 100 గ్రాములు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వివరించారు.
Next Story