Fri Nov 22 2024 19:55:47 GMT+0000 (Coordinated Universal Time)
నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల ముఠాలు అరెస్ట్.. భారీగా సర్టిఫికేట్లు స్వాధీనం
నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీవీ ఆనంద్
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులే టార్గెట్ గా నకిలీ సర్టిఫికేట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. మలక్ పేట్ - ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర నకిలీ సర్టిఫికేట్స్ తయారీ ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10 మంది అంతర్రాష్ట్ర నిర్వాహకుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లను భారీమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని వారికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అమ్ముతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు ఫిక్స్ చేసి, కావలసిన డిగ్రీ సర్టిఫికేట్లను అమ్ముకుంటున్నారని తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడు అయిన శ్రీకాంత్ రెడ్డి.. శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కన్సల్టెన్సీని నిర్వహిస్తూ.. టెలీకాలర్లు.. ఫెయిల్ అయిన విద్యార్థులకు కాల్ చేసి వారిని రప్పిస్తున్నారన్నారు.
Also Read : మరోసారి జగన్ తో భేటీ అయిన అలీ
బీటెక్ సర్టిఫికెట్ కు రూ.3 లక్షలు, బీఎస్సీ సర్టిఫికెట్ కు 1.7 లక్షలు, బీకాం సరిఫ్టికెట్ కు రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్ సాయంతోనే ఈ దందా నడుస్తోంది. SRK యూనివర్సిటీ చైర్మన్ కు కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది. దీనిపై విచారణ చేస్తున్నాం. ఇక ప్రైడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో కూడా మరో ముఠా ఇలాగే దందా చేస్తున్నారని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. SRK యూనివర్సిటీకి చెందిన 8 ఫేక్ సర్టిఫికెట్లు, మధ్యప్రదేశ్ లోని స్వామి వివేకానంద యూనివర్సిటీకి చెందిన 24 సర్టిఫికెట్లు, ఉత్తరప్రదేశ్ కి చెందిన గ్లోకల్ యూనివర్సిటీకి చెందిన 4 సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే నిందితుల నుండి రబ్బర్ స్టాంప్స్, వివిధ యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సీజ్ చేసి, ఏడుగురు విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
News Summary - Hyderabad Police Arrests Fake Degree Certificates gangs
Next Story