Wed Apr 02 2025 19:20:48 GMT+0000 (Coordinated Universal Time)
అప్జల్ గంజ్ కాల్పుల కేసుల్లో పురోగతి
అప్జల్ గంజ్ కాల్పుల కేసుల్లో హైదరాబాద్ పోలీసులు కొంత పురోగతి సాధించారు

అప్జల్ గంజ్ కాల్పుల కేసుల్లో హైదరాబాద్ పోలీసులు కొంత పురోగతి సాధించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపునకు వెళ్లినట్లుగా గుర్తించారు. ఆటోలో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి అక్కడి నుంచి మరొక ఆటోలో మారి సికింద్రాబాద్ కు వచ్చారు. అక్కడ కొత్త బ్యాగులను, బట్టలను కొనుగోలు చేశారు. బీదర్ లో దోచుకున్న సొమ్మును ఆ బ్యాగ్ లోకి మార్చి మరీ వెళ్లిపోయారు. కొత్త బట్టలు, కొత్త బ్యాగులతో వారు రైల్వే స్టేషన్ వరకూ వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలిసింది. మనీష్ పై ఇప్పటికే బీహార్ ప్రభుత్వం రివార్డు కూడా ప్రకటించింది. పోలీసుల కన్ను గప్పి పారిపోయేందుకు అనేక రకాలుగా నిందితులు ప్రయత్నిస్తున్నారు.
నాలుగు రాష్ట్రాల పోలీసులు...
దీంతో రైలు ద్వారా ఎటు వైపు వెళ్లారన్నదానిపై పోలీసులు రైల్వే శాఖ ఆరా తీస్తుంది. పాత బ్యాగులను సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు బీహార్ కు చెందిన మనీష్ గా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయి వారి కోసం గాలిస్తున్నారు. బీహార్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. బీహార్ లో ఇలాంటి ఘటన జరగడంతో ఛత్తీస్ ఘడ్, బీహార్, కర్ణాటక, తెలంగాణ పోలీసులు మనీష్ కుమార్ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు అప్జల్ గంజ్ లో ధరించిన దుస్తులను అక్కడే వదిలి పారిపోవడంతో డాగ్ స్వ్కాడ్ ద్వారా కూడా గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story