Sat Dec 21 2024 08:18:49 GMT+0000 (Coordinated Universal Time)
బీహార్ లో పోలీసులపై కాల్పులు
హైదరాబాద్ పోలీసులపై బీహార్ లో కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో సురక్షితంగా పోలీసులు బయటపడ్డారు
హైదరాబాద్ పోలీసులపై బీహార్ లో కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో సురక్షితంగా పోలీసులు బయటపడ్డారు. కరడు గట్టిన నేరగాళ్లు పోలీసులపై కాల్పులు జరిపారు. వాహనాల కంపెనీల ఫ్రాంఛైజీల పేరిట సైబర్ మోసాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న నేరగాళ్లను పట్టించుకునేందుకు బీహార్ కు సైబరాబాద్ పోలీసులు బీహార్ కు వెళ్లారు. బీహార్ లోనినవాా జిల్లాలోని భవానీబిగా గ్రామంలో వారు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
పెద్దయెత్తున నగదు...
అయితే ఈ సందర్భంగా పోలీసులపై కాల్పులు జరిగాయి. ఈ కేసులో నిందితుడు మితిలేష్ ప్రసాద్ పోలీసులపై కాల్పులు జరిపాడు. నలుగురు నిందితులను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు. నిందితుల వద్ద నుంచి సైబరాబాద్ పోలీసులు 1.22 కోట్ల రూపాయల నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ నలుగురిని హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు.
Next Story