Sun Dec 22 2024 07:15:55 GMT+0000 (Coordinated Universal Time)
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ను తప్పించుకోడానికి.. ప్రాణాలు కోల్పోయాడు
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ల నుండి తప్పించుకోడానికి
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ల నుండి తప్పించుకోడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. పోలీసుల తనిఖీ ఉందంటే చాలు ఆ రూట్ లో వెళ్లకూడదని అనుకునేవారు కొందరైతే.. వేగంగా వెళ్ళిపోయేవారు మరికొందరు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నుండి తప్పించుకునే క్రమంలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఓ యువకుడు ఏకంగా ప్రాణాలనే కోల్పోయాడు.
నవంబర్ 15, శుక్రవారం రాత్రి శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వాహనదారుడు రాంగ్ రూట్ లో వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. శంషాబాద్‌కు చెందిన వ్యక్తి, శంషాబాద్ రహదారిపై వెళుతుండగా ట్రాఫిక్ పోలీసుల బృందం డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేయడాన్ని గమనించాడు. ఆ వ్యక్తి ట్రాఫిక్ పోలీసుల నుండి తప్పించుకోవడానికి U టర్న్ తీసుకున్నాడు. అయితే ఓ కారు అతడిని ఢీకొట్టింది. అతనికి తీవ్ర గాయాలు అవ్వడమే కాకుండా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసు విచారణ ప్రారంభించారు.
Next Story