Sun Dec 22 2024 23:43:12 GMT+0000 (Coordinated Universal Time)
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
ఇటీవలే అభినవ్ - సౌందర్య దంపతులు హైదరాబాద్ కు మకాం మార్చారు. నగరంలోని కొండాపూర్ లో నివాసం ఉంటున్నారు.
ఓ భవనం పై నుండీ దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శంషాబాద్ లో వెలుగుచూసింది. ఆత్మహత్యకు ముందుకు ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు తెలిపింది. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర షోలాపూర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సౌందర్య(33)కు అదే ప్రాంతానికి చెందిన ఆర్కిటెక్చర్ ఇంజినీర్ అభినవ్ తో 6 నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహమైంది. సౌందర్య మూడేళ్లుగా హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది.
ఇటీవలే అభినవ్ - సౌందర్య దంపతులు హైదరాబాద్ కు మకాం మార్చారు. నగరంలోని కొండాపూర్ లో నివాసం ఉంటున్నారు. జూన్8న ఆమె విధులకు బయల్దేరి.. శంషాబాద్ లో ఓ భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. వారు వెంటనే 100కు డయల్ చేసి చెప్పడంతో పోలీసులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే సౌందర్య బిల్డింగ్ పై నుండి దూకి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ 10 ఆదివారం నాడు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సౌందర్య తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితమే మరణించారు. జీవితం తాను ఊహించుకున్నట్లుగా లేదన్న బాధతో సౌందర్య చనిపోయిందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. భర్త అభినవ్ ఇటీవలే ఉద్యోగం కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు.
Next Story