Mon Dec 23 2024 10:09:20 GMT+0000 (Coordinated Universal Time)
Spa In Hyderabad: హైదరాబాద్ లో క్రాస్ మసాజింగ్
స్పా సెంటర్లపై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు
Spa In Hyderabad: స్పా సెంటర్లపై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. క్రాస్ మసాజింగ్ చేయిస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, గుడిమాల్కాపుర్ పోలీసులు సంయుక్తంగా కలిసి నానల్ నగర్ చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జన్నత్ గోల్డెన్ అనే రెండు స్పా సెంటర్ల పై దాడి చేశారు. క్రాస్ మసాజ్ చేస్తున్న 5 మంది అమ్మాయిలతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమ స్పా సెంటర్ లపై పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు,గుడిమాల్కాపుర్ పోలీసులు సంయుక్తంగా కలిసి నానల్ నగర్ లోని ఉన్న ఓ అపార్ట్ మెంట్లో జన్నత్,గోల్డెన్ అనే రెండు స్పా సెంటర్ల పై దాడులు నిర్వహించారు. పట్టుకున్న 5 మంది మహిళలు 1 వ్యక్తితో పాటు స్పా సెంటర్ల యజమానుల పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి స్పా సెంటర్లు ఎక్కడ ఉన్నా ఆ భవన యజమానులు వారిని ఖాళీ చేయించాలని.. లేని పక్షంలో వారి పైన కుడా తగిన చర్యలు తీసుకోవలసి వస్తుందని గుడిమల్కాపుర్ ఇన్స్పెక్టర్ ముజీబ్ రెహ్మాన్ హెచ్చరించారు.
Next Story