Mon Dec 23 2024 04:09:55 GMT+0000 (Coordinated Universal Time)
కొడుకును అడ్డుకోని తల్లి.. జైలు పాలే
కొడుకు దారుణం చేస్తున్నా కూడా అడ్డుకోని తల్లి కటకటాల పాలైంది. యువతిని బహిరంగంగా
కొడుకు దారుణం చేస్తున్నా కూడా అడ్డుకోని తల్లి కటకటాల పాలైంది. యువతిని బహిరంగంగా వివస్త్రను చేసిన యువకుడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగష్టు 9వ తేదీ బుధవారం నాడు రాచకొండ పోలీసులు నాగమ్మను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆగస్టు 6వ తేదీ రాత్రి హైదరాబాద్ బాలాజీ నగర్లో జరిగిన షాకింగ్ ఘటనపై పోలీసులు నాగమ్మతో పాటు ఆమె కుమారుడు పెద్దమారయ్యపై కేసు నమోదు చేశారు.
రోడ్డుపై వెళ్తున్న యువతిని అనుచితంగా తాకాడు 30 ఏళ్ల నిందితుడు. బాధితురాలు అతడిని నెట్టి తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు ఆమెపై దూకుడుగా వెళ్లాడు.. ఆమె బట్టలను కూడా చింపేశాడు. మహిళను రక్షించేందుకు పెద్దమారయ్య తల్లి ఏమీ చేయలేదు. బైక్పై వెళుతున్న మరో మహిళ నిందితుడిని ప్రశ్నించేందుకు ఆగగా, అతడు ఆమెపై కూడా దాడికి యత్నించాడు. బాధితురాలు సుమారు 15 నిమిషాల పాటు రోడ్డుపైనే నిల్చుంది. నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కొందరు వ్యక్తులు ఆమె కు బట్టలు ఇచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ నెల 6న జరిగిన ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ కేసుపై పూర్తిస్థాయి విచారణ జరిపి వారంలోగా నివేదిక నివ్వాలని డీజీపీని కోరింది. యువతికి న్యాయం చేయాలని ఆదేశించింది.
Next Story