Tue Nov 05 2024 19:34:23 GMT+0000 (Coordinated Universal Time)
జాగ్రత్త.. పార్సల్ వచ్చిందన్నారు- మూడు లక్షలు పోగొట్టుకున్న టెకీ
ఆన్ లైన్ లో ఎన్నో మోసాలు జరుగుతూ ఉంటాయి. అయితే చదువుకున్న
ఆన్ లైన్ లో ఎన్నో మోసాలు జరుగుతూ ఉంటాయి. అయితే చదువుకున్న వాళ్లను కూడా కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. ముంబై కస్టమ్స్ ఆఫీసులో ఫెడెక్స్ పార్శిల్ వచ్చిందని.. అందులో నిషేధిత వస్తువులు ఉన్నాయని బెదిరించారు. 32 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను నమ్మించి మోసం చేశారు. అధికారులు చర్యలు తీసుకోకుండా ఉండాలంటే తమకు డబ్బులు చెల్లించాలంటూ అతడి దగ్గర నుండి ఏకంగా రూ. 3,71,581 రూపాయలు లాగేశారు.
ఐదు పాస్‌పోర్ట్‌లు, మూడు బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఒక జత బూట్లు, 200 గ్రాముల MDMA వంటి వస్తువులు ఉన్న పార్శిల్‌ను పంపడానికి అతని ఆధార్ కార్డ్ నంబర్ ఉపయోగించారని మోసగాళ్లు బాధితుడిని నమ్మించారు. ముంబయిలోని అంధేరిలోని క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులుగా నటిస్తూ బాధితుడిని స్కైప్ వీడియో కాల్లో పాల్గొనమని బెదిరించారు. బాధితుడి నుండి అతని బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలతో సహా సున్నితమైన ఆర్థిక సమాచారాన్ని సేకరించడం ప్రారంభించాడు. హవాలా నగదు బదిలీలు, మాదకద్రవ్యాల వ్యాపారం నీ ఆధార్ కార్డును ఉపయోగించినట్లు కూడా చెప్పారు. బెదిరింపులకు భయపడిపోయిన బాధితుడు వారు చెప్పిన మొత్తాన్ని బదిలీ చేసేశాడు. అలా ఏకంగా 3,71,581 పంపించాడు. తమ ఫైనాన్షియల్ టీమ్ ద్వారా డబ్బును వెరిఫై చేసి తిరిగి చెల్లిస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు. అయితే తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తదుపరి విచారణ కొనసాగుతోంది.
Next Story