Fri Dec 20 2024 11:34:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: కేపీహెచ్బీలో విషాదం.. గోడ కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్ నగరంలో ఓ విషాదం చోటు చేసుకుంది. నగరంలోని కేపీహెచ్బీ అడ్డగుట్టలో నిర్మాణంలో ఉనన్న భవనం గోడ కూలిపోయింది..
హైదరాబాద్ నగరంలో ఓ విషాదం చోటు చేసుకుంది. నగరంలోని కేపీహెచ్బీ అడ్డగుట్టలో నిర్మాణంలో ఉనన్న భవనం గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానికలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గోడ కూలి ముగ్గురు మృతి చెందడంతో విషాదంగా మారింది. ఈ ప్రమాదంలో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అయితే భవనం నిర్మాణంలో ఉంది. భారీ వర్షాల కారణంగా ఈ గోడ కూలిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భవనంపై గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉన్నా.. ఇంటి యజమాని నిర్లక్ష్యం ఉన్నా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.
Next Story