Mon Dec 23 2024 14:33:37 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఇద్దరు ట్రాన్స్జెండర్ల దారుణ హత్య
టప్పచబుత్ర పరిధిలోని దైబాగ్ ప్రాంతంలో యూసుఫ్ అలియాస్ డాలి(25), రియాజ్ అలియాస్ సోఫియా ( 30) అనే ఇద్దరు హిజ్రాలు నివాసం
హైదరాబాద్ నగరంలో ట్రాన్స్ జెండర్లను అతి దారుణంగా హత్య చేశారు. టప్పాచబుత్ర లో ఇద్దరు హిజ్రాలు దారుణ హత్యకు గురయ్యారు. కత్తి, బండరాళ్లతో మోది ఇద్దరు ట్రాన్స్ జండర్లను హత్య చేశారు దుండగులు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టప్పచబుత్ర పరిధిలోని దైబాగ్ ప్రాంతంలో యూసుఫ్ అలియాస్ డాలి(25), రియాజ్ అలియాస్ సోఫియా ( 30) అనే ఇద్దరు హిజ్రాలు నివాసం ఉంటున్నారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో కొంతమంది దుండగులు వారిపై ఒక్కసారిగా దాడి చేసారు. కత్తులు, బండరాళ్లతో కొట్టి వారిద్దరిని కిరాతకంగా చంపేశారు. ఈ హత్యతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీనియర్ పోలీస్ అధికారులు, క్లూస్ టీం హత్య జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. డీసీ కిరణ్ ఖరే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని, ఈ హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీనలను పరిశీలిస్తున్నామనని, హత్య చేయడానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉందని తెలిపారు.
Next Story