Sun Dec 22 2024 23:59:04 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే.. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటకండని చెప్పేది
ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు దాటుతూ ఉండగా..
ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు దాటుతూ ఉండగా.. కారు ఢీకొన్న ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ఫోన్ లో మాట్లాడుతూ.. హైవేను క్రాస్ చేయాలని చూసిన అతడిని కారు ఢీకొట్టడంతో ఎగిరి కిందపడిపోయాడు. కారు ఢీకొట్టడంతో కారు బానెట్పై పడిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్-వరంగల్ హైవేపై అన్నోజిగూడ సమీపంలో చోటుచేసుకుంది.
యాక్సిడ్నెట్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. IPS అధికారి, TSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ ఈ వీడియోను షేర్ చేసారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు దాటడం ప్రమాదకరం! మీ భద్రత మీ చేతుల్లో ఉంది. జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా ఉండండి. నిర్లక్ష్యంగా వ్యవహరించకండని సూచించారు. ఇలాంటి విషయాలలో రిస్క్ తీసుకోకండని కోరారు.
Next Story