Mon Dec 23 2024 01:04:31 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరులో హైదరాబాద్ యువతి దారుణ హత్య
ఆకాంక్షను కలిసేందుకు అర్పిత్ బెంగళూరుకు తరచూ వచ్చేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జీవన్ భీమా నగర్ లోని..
హైదరాబాద్ కు చెందిన యువతి బెంగళూరులో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని పోలీసులు ఆకాంక్షగా గుర్తించారు. ఆమెతో సహజీవనం చేసిన బాయ్ ఫ్రెండ్ అర్పిత్ ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు నగరంలోని జీవన్బీమా నగర్లో ఈ ఘటన సోమవారం (జూన్5) రాత్రి ఈ ఘటన జరిగింది. ఆకాంక్ష, అర్పిత్ లు రెండేళ్లపాటు హైదరాబాద్ లో సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. ఆకాంక్షకు వేరే ఉద్యోగం రావడంతో ఆమె బెంగళూరుకు షిఫ్ట్ అయి.. అక్కడే ఒక ఫ్లాట్ తో ఉంటుంది.
ఆకాంక్షను కలిసేందుకు అర్పిత్ బెంగళూరుకు తరచూ వచ్చేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జీవన్ భీమా నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఆకాంక్ష వద్దకు ఇటీవలే అర్పిత్ రాగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. క్షణికావేశంలో అర్పిత్ ఆకాంక్షను హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించడంలో విఫలమైనట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఆకాంక్ష మృతదేహాన్ని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసి.. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అర్పిత్ ప్రయత్నించాడు. తనవల్ల కాకపోవడంతో మృతదేహాన్ని కిందే వదిలేసి ఇంటి తలుపులు వేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. ఆకాంక్ష రూమ్ మేట్ అపార్ట్ మెంట్ కు రావడంతో ఈ ఘటన వెలుగుచూసింది. పరారీలో ఉన్న ఢిల్లీకి చెందిన అర్పిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story