Mon Dec 23 2024 07:28:21 GMT+0000 (Coordinated Universal Time)
అత్యాచారయత్నం.. వ్యక్తిని చంపిన మహిళ
మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రాజేంద్రనగర్లోని బుద్వేల్లో శుక్రవారం తెల్లవారుజామున తన ఇంట్లోకి చొరబడి తనపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. ఆమె ఇంటి దగ్గర ఉండే శ్రీనివాస్ అనే వ్యక్తి తెల్లవారుజామున 4 గంటల సమయంలో జయమ్మ ఇంటి తలుపు తట్టాడు. జయమ్మ తలుపు తీయగానే శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై బలవంతం చేయబోయాడు. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ ఆమెను వెంబడించడంతో జయమ్మ ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. అంతలో జయమ్మ ఇనుప రాడ్డు పట్టుకుని శ్రీనివాస్ తలపై కొట్టింది. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే అతడు మృతి చెందాడు.
జయమ్మ, ఆమె భర్త రాజేంద్రనగర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సిసిటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి.
Next Story