Mon Dec 23 2024 16:37:43 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం
హైదరాబాద్ ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పట్టపగలు ప్రియురాలి ఇంట్లోకి
హైదరాబాద్ ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పట్టపగలు ప్రియురాలి ఇంట్లోకి చొరబడిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తమ్ముడిని పొడిచాడు. కేకలు విన్న స్థానికులు నిందితుడిని ఓ గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు. యువతి తమ్ముడు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న యువతిని ఉస్మానియాకు తరలించారు.
షాద్‌నగర్ కొందుర్గులో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించే సురేందర్ గౌడ్, ఇందిర దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె సంఘవి (25) ఉప్పల్ రామాంతపూర్‌లో చదువుతోంది. ఆమె తమ్ముడు పృథ్వీ (24) అలియాస్ చింటూ బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. మరో తమ్ముడు పదో తరగతి చదువుతున్నాడు. సంఘవి, పృథ్వీ ఇద్దరూ చదువుల కోసం ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ రోడ్ నెం.5లో గల భవనం మొదటి అంతస్తులో ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.45 సమయంలో సంఘవి ఉంటున్న పోర్షన్ నుంచి అరుపులు కేకలు వినిపించడంతో పక్క వాటాలో ఉంటున్న ఝాన్సీ అనే మహిళ పరుగున బయటకొచ్చి చూసింది. ఛాతీ నుంచి రక్తం కారుతూ పృథ్వీ కనిపించాడు. అక్కా, తమ్ముడి ఉన్న సమయంలో ఇంట్లోకి వచ్చిన యువకుడు వారిద్దరిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన యువతి తమ్ముడు చింటు(20) మృతి చెందాడు. యువతి తీవ్రంగా గాయపడగా ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోకి శివకుమార్ కత్తితో రావడంతో యువతి, ఆమె తమ్ముడు గట్టిగా కేకలు వేశారు. దీంతో స్థానికులు దాడికి పాల్పడిన యువకుడిని ఓ గదిలో బంధించి పోలీసులు సమాచారం ఇచ్చారు.
సంఘవి, పృథ్వీలపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. ఫరూక్ నగర్ మండలానికి నిందితుడు శివకుమార్ (26) రామాంతపూర్‌లో ఉంటూ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. అతను, సంఘవి కొందుర్గులో పదో తరగతి కలిసి చదువుకున్నారు. దీంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత మనస్ఫర్థలు రావడంతో సంఘవి శివకుమార్‌తో మాట్లాడడం మానేసింది. దాంతో అతను ఆమెపై పగపెంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమెను చంపడానికి ప్రయత్నించాడు.
Next Story