Sat Dec 21 2024 16:59:26 GMT+0000 (Coordinated Universal Time)
యూట్యూబ్ లో వ్యూస్ రాలేదని.. ఊహించని నిర్ణయం తీసుకున్నాడు
వ్యూస్ రాలేదని.. ఊహించని నిర్ణయం
యూ ట్యూబ్ ఛానల్ కు వ్యూస్ రావడం లేదంటూ ఓ విద్యార్థి బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ క్రాంతి నగర్ కాలనీలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. క్రాంతి నగర్ లో ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళనాడుకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి రైల్వేలో, అతని భార్య డిఫెన్స్‌లో పనిచేస్తున్నారు. వీరి కుమారుడు దీనా(24) ఇంజినీరింగ్ చదువుతూ హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లోని క్రాంతినగర్‌లో పదేళ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. దీనా వారి అపార్ట్మెంట్ పై నుంచి కిందకు దూకాదు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దీనా నాలుగేళ్లుగా సెల్ఫ్ ఫ్లో పేరిట యూట్యూబ్ గేమ్ చానల్ నిర్వహిస్తున్నాడు. క్యాంపస్ నుంచి రెండు నెలల క్రితం సెలవులపై దీనా సైదాబాద్‌కు వచ్చాడు. గురువారం ఉదయం 5:20 సమయంలో అపార్ట్మెంట్ ఐదో అంతస్తుపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మహత్యకు ముందు దీనా.. యూట్యూబ్ పేజీలో సూసైడ్ నోట్ పోస్ట్ చేశాడు. జీవితం విలువైనది అన్న అర్థంలో ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచించాడు. తాను చిన్నప్పుడే లైంగిక దాడికి గురయ్యానని, తనను ఎవరూ పట్టించుకునే వారు కాదని, తల్లిదండ్రులు కూడా అశ్రద్ధ చేశారని, ప్రేమను పంచలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అతడు ఎవరితోనూ స్నేహం చేసేవాడు కాదని.. ఎప్పుడూ గదిలోనే ఉండేవాడని అపార్ట్‌మెంట్‌వాసులు తెలిపారు. ఎప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చొని వీడియో గేమ్‌లు ఆడుతూ వాటితో కొత్త వీడియోలు తయారు చేసేవాడని చెప్పారు.
Next Story