Mon Dec 23 2024 02:49:39 GMT+0000 (Coordinated Universal Time)
శ్వేతను చంపింది ఆమె భర్తే!!
ఆస్ట్రేలియాలో చనిపోయిన తెలుగు మహిళ శ్వేతను చంపింది ఆమె భర్తేనని
ఆస్ట్రేలియాలో చనిపోయిన తెలుగు మహిళ శ్వేతను చంపింది ఆమె భర్తేనని తేలింది. అశోక్రాజ్ తన భార్య శ్వేతను హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపక్కన బిన్లో పడేసినట్లు సమాచారం. హత్యానంతరం కొడుకును ఇండియాకు తీసుకొచ్చి అత్తమామల వద్ద వదిలేశాడు. తర్వాత ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా పోలీసులు మృతదేహాన్ని కనుగొని హత్యపై దర్యాప్తు ప్రారంభించి అశోక్రాజ్ను అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శ్వేత మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా మాట్లాడినట్లు ఆయన స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదికను సంబంధిత అధికారులకు అందించారని.. మృతదేహాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. శ్వేత హత్య ఆమె కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురి చేసింది. మహిళ హత్యకు దారితీసిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చెత్తడబ్బాలో మహిళ మృతదేహాన్ని గుర్తించడం తెలుగు కమ్యూనిటీని షాక్ కు గురి చేసింది. భార్యను హత్య చేసిన తర్వాత అశోక్ రాజ్ కుమారుడిని తీసుకుని హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడ అత్తగారింట్లో కుమారుడిని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడంటే.. ముందే హత్యకు ప్లాన్ చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు.
Next Story