Thu Dec 19 2024 18:46:49 GMT+0000 (Coordinated Universal Time)
IAS officer wife: ఐఏఎస్ ఆఫీసర్ భార్య ఆత్మహత్య.. శవాన్ని చూడడానికి కూడా ఇష్టపడని భర్త
తొమ్మిది నెలల క్రితం గ్యాంగ్‌స్టర్‌తో కలిసి పారిపోయిన గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి భార్య
తొమ్మిది నెలల క్రితం గ్యాంగ్‌స్టర్‌తో కలిసి పారిపోయిన గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి భార్య ఆత్మహత్య చేసుకుని మరణించింది. జూలై 21న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు మీడియా నివేదించింది. తమిళనాడుకు చెందిన మహిళ శనివారం నగరంలోని తన భర్త ఇంటికి తిరిగి వచ్చింది. అయితే పిల్లల అపహరణ కేసులో నిందితురాలిగా ఉన్న తన భార్యను ఇంట్లోకి అనుమతించవద్దని ఆమె భర్త తన ఇంటి సిబ్బందికి సూచించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ తన భర్త అధికారిక నివాసానికి ఎదురుగా ఉన్న తోటలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. 45 ఏళ్ల ఆమెను గాంధీనగర్ సివిల్ ఆసుపత్రిలో చేర్చగా మరుసటి రోజు ఆమె మరణించింది. ఈ జంట 2023లో విడిపోయారు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తొమ్మిది నెలల క్రితం తన సొంత రాష్ట్రంలో ఒక గ్యాంగ్‌స్టర్‌తో మహిళ పారిపోయిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. గ్యాంగ్‌స్టర్, అతని సహాయకుడితో పాటు మైనర్‌ను కిడ్నాప్ చేసిన కేసులో ఆమె పేరు బయటపడింది. సదరు గ్యాంగ్ స్టర్ ఓ బాలుడిని కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేశాడు. పోలీసులు బాలుడిని కాపాడారు. గ్యాంగ్ స్టర్, అతడి అనుచరులతో పాటు మహిళ పైనా కిడ్నాప్ కేసు నమోదు చేసి, వారి కోసం గాలిస్తున్నారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మహిళ తన భర్త ఐఏఎస్ రంజిత్ కుమార్ దగ్గరికి తిరిగి వచ్చింది. రంజిత్ ఆమెను ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదు. దీంతో సూసైడ్ నోట్ రాసిన మహిళ పురుగుమందు తాగింది. చికిత్స పొందుతూ ఆమె చనిపోగా.. భార్య మృతదేహాన్ని తీసుకోవడానికి రంజిత్ నిరాకరించారు.
ఆమె తన వేదన గురించి వివరిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు ఓ లేఖ కూడా రాసింది. లేఖలో తాను గ్యాంగ్‌స్టర్ ఉచ్చులో చిక్కుకున్నానని, అతను ప్రధాన నిందితుడిగా ఉన్న రెండు క్రిమినల్ కేసులలో తాను కూడా చిక్కుకుపోయానని మహిళ ఆ లేఖలో పేర్కొంది. తన భర్త గొప్ప వ్యక్తి అని, తన పిల్లలను బాగా చూసుకున్నాడని లేఖలో ప్రస్తావించింది.
Next Story