Tue Dec 24 2024 00:08:00 GMT+0000 (Coordinated Universal Time)
డిసెంబర్ 31న హోటల్లో పార్టీ: అస్సాంలో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి
అస్సాంలోని ఐఐటీ గువాహటిలో ఇంజినీరింగ్ చదువుతున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని
అస్సాంలోని ఐఐటీ గువాహటిలో ఇంజినీరింగ్ చదువుతున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పుల్లూరి ఐశ్వర్యగా గుర్తించారు. ఐఐటీ గువాహటిలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్ధినిగా పోలీసులు దృవీకరించారు. ఐఐటీ గువాహటిలో ఈసీఈ చదువుతున్న ఐశ్వర్యతో పాటు ఆమె ముగ్గురు స్నేహితులు నూతన సంవత్సరం వేడుకల నిమిత్తం ఐఐటీ క్యాంపస్‌కు 25 కి.మీల దూరంలోని ఓ హోటల్లో రెండు గదులను బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 31 రాత్రి వారంతా హోటల్లో పార్టీ చేసుకున్నారు. జనవరి 1న ఉదయం తనతోపాటు గదిలో ఉన్న మరో స్నేహితురాలు వాష్‌రూమ్‌కు వెళ్లగా అక్కడ ఐశ్వర్య నిర్జీవంగా కనిపించింది. ఇది గమనించిన తోటి స్నేహితులు ఆమెను గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె మరణించినట్లు తెలిపారు
తెలంగాణకు చెందిన విద్యార్థిని డిసెంబర్ 31 సాయంత్రం న్యూ ఇయర్ జరుపుకోవడానికి తన ముగ్గురు బ్యాచ్మేట్లతో కలిసి ఇన్స్టిట్యూట్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని పల్టన్ బజార్ ప్రాంతానికి పార్టీ కోసం వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు ఉదయం బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని వారు తెలిపారు. "మేము మా దర్యాప్తు ప్రారంభించాము, ఆమె స్నేహితులందరినీ విచారిస్తున్నాము. ఇతర వ్యక్తులను కూడా ప్రశ్నిస్తున్నాము" అని అధికారి తెలిపారు. బాధితురాలిని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఐశ్వర్య పుల్లూరిగా గుర్తించారు. ఆమెతో పాటు మరో అమ్మాయి, ఇద్దరు మగ విద్యార్థులు హోటల్లో చెక్-ఇన్ చేశారు.డిసెంబర్ 31న అర్ధరాత్రి హోటల్ తనిఖీలో భాగంగా వీరు బుక్ చేసుకున్న గదులకు వెళ్లి చూడగా.. ఐశ్వర్యతో పాటు ఆమె స్నేహితులు మత్తులో ఉన్నట్లు సిబ్బంది చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. విద్యార్థి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఐఐటీ-గౌహతి ఓ ప్రకటన విడుదల చేసింది. "డిసెంబరు 31, 2023న IIT గౌహతి క్యాంపస్ వెలుపల ఒక విద్యార్థి మరణించిన దురదృష్టకరమైన వార్తను పంచుకోవడం చాలా విచారం కలిగిస్తోంది. ఈ దురదృష్టకర సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు" అని IIT-గువాహటి ఒక ప్రకటనలో పేర్కొంది.
Next Story