Mon Dec 23 2024 04:16:32 GMT+0000 (Coordinated Universal Time)
అందరి ముందూ 23 ఏళ్ల యువకుడి తల నరికి చంపిన 50 ఏళ్ల వ్యక్తి
నిందితుడు శంక్లా రామ్ భీల్ను అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.
జలోర్ జిల్లాలోని అహోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పదర్డి గ్రామంలో బుధవారం సాయంత్రం 23 ఏళ్ల వ్యక్తిని 50 ఏళ్ల వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. నరికిన తలను రోడ్డుపక్కన పడేశాడు. ఈ హత్య చేసిన తర్వాత నిందితుడు కొన్ని నిమిషాల పాటు దాన్ని పట్టుకుని స్థానికులకు చూపించాడని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన తర్వాత చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. నిందితుడు శంక్లా రామ్ భీల్ను అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. భీల్, బాధితుడు కిషోర్ సింగ్ మధ్య వ్యక్తిగత వివాదం ఉందని పోలీసులు తెలిపారు. హత్యను నిరసిస్తూ నిందితుల కుటుంబాన్ని అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హత్య ముందస్తు ప్రణాళికతో జరగలేదని, మృతుడు రోజూ మద్యం మత్తులో నిందితుడి కుటుంబాన్ని దుర్భాషలాడుతుండడంతో నిందితుడు ఆగ్రహంతో ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.
బుధవారం సాయంత్రం కిషోర్ సింగ్ పదర్డి గ్రామం బస్టాండ్ ప్రాంతం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కిషోర్ సింగ్ ముందు బైక్ ఆపిన నిందితుడు , అతని మెడపై గొడ్డలితో మూడు వేట్లు వేశాడని జలోర్ ఎస్పీ కిరణ్ కాంగ్ చెప్పారు. నిందితుడు తెగిన తలను గ్రామస్థులకు చూపించాడు. తలను 100 మీటర్ల దూరం విసిరి పారిపోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కిషోర్పై వివిధ పోలీసు స్టేషన్లలో ఆరు చోరీ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మృతుడు తనను, తన కుటుంబ సభ్యులను ఎప్పుడూ తిడుతూనే ఉండేవాడని నిందితుడు పోలీసులకు చెప్పాడు.
Next Story