Wed Mar 26 2025 14:50:33 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. గురుద్వారలో జరిగిన కాల్పుల్లో ఇద్దరికి తీవ్రగాయాల పాలయ్యారు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. గురుద్వారలో జరిగిన కాల్పుల్లో ఇద్దరికి తీవ్రగాయాల పాలయ్యారు. కాలిఫోర్నియా శాక్రమెంటోలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన కాల్పులతో ఇద్దరు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు.
స్నేహితుల మధ్య...
సిక్కు సొసైటీ కి చెందిన గురుద్వారాలో ఈ కాల్పులు జరిగాయి. అయితే కాల్పుల్లో గాయపడిన ఇద్దరి పరిస్థిితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాల్పులకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే వ్యక్తిగత కక్షలతోనే కాల్పులకు తెగపడి ఉండవచ్చనిపోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసిందని అమెరికా పోలీసులు చెబుతున్నారు.
Next Story