Wed Nov 27 2024 08:49:48 GMT+0000 (Coordinated Universal Time)
వేరే వ్యక్తితో అఫైర్ గురించి ఆమె క్యాబ్ లో మాట్లాడింది
క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్లో తన అఫైర్ గురించి మాట్లాడిన గృహిణిని
బెంగళూరులో క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్లో తన అఫైర్ గురించి మాట్లాడిన గృహిణిని బ్లాక్మెయిల్ చేసినందుకు 35 ఏళ్ల క్యాబ్ డ్రైవర్‌ను ఆర్ఎం నగర్ పోలీసులు ఆగస్టు 2న అరెస్టు చేశారు. గత ఏడాది తన క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్లో ఆ మహిళ తన అఫైర్ గురించి మాట్లాడింది.. అది విన్న క్యాబ్ డ్రైవర్ ఆమెకు స్నేహితుడిగా నటిస్తూ మోసగించాడు. డబ్బును, బంగారాన్ని కూడా లాగేశాడు. ఈ ఆరోపణలపై అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మహిళను బెదిరించి రూ.22 లక్షలు, రూ.60 లక్షల విలువ చేసే 960 గ్రాముల బంగారాన్ని కాజేయాలని చూశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు క్యాబ్-అగ్రిగేటర్ అప్లికేషన్‌పై గత సంవత్సరం నగరంలోని ఇందిరానగర్ నుండి బనస్వాడికి కిరణ్ కుమార్ నడుపుతున్న క్యాబ్‌ను బుక్ చేశాడు. ఆమె స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతూ, తన వ్యక్తిగత విషయాలను చర్చించింది. స్నేహితురాలి సలహాలు కోరుతుండగా, కుమార్ విన్నాడు. నవంబర్ 2022లో, అతను మహిళ చిన్ననాటి స్నేహితుడిగా నటిస్తూ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తానని ముందుకు వచ్చాడు. అందుకు ఆ మహిళ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఫోన్లో టచ్‌లో ఉన్నారు. కొంచెం డబ్బు అవసరం ఉందని అడిగాడు. ఆమె వెంటనే అతని బ్యాంక్ అకౌంట్‌కి రూ.22 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. కొన్ని రోజులు గడిచాక అతడు తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కాదని తెలుసుకున్న ఆ మహిళ అతనితో మాట్లాడటం మానేసింది. కిరణ్ మాత్రం ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. నీకు మరొకరితో ఎఫైర్ ఉందన్న విషయం నీ భర్తకు చెప్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె.. అతడు అడిగినట్లుగానే ఈ నెల ఏప్రిల్‌లో తన దగ్గర ఉన్న బంగారం ఇచ్చేసింది. ఇటీవల భర్త బంగారం ఎక్కడా అని అడగగా.. ఆమె నిజం బయటకు కక్కేసింది.
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (DCP) (తూర్పు విభాగం) భీమశంకర్ గులేద్ మాట్లాడుతూ, “అతను తన స్నేహితుడు కాదని తెలుసుకుని, అతనిని నిలదీసింది. అప్పుడు అతడు బెదిరించడం మొదలుపెట్టాడు. నీ పర్సనల్ విషయాలను ఆన్లైన్లో ప్రచురిస్తానని బెదిరించాడు. మహిళ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసినా కూడా నిందితుడు మరింత డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు. తాకట్టు పెట్టిన బంగారం విలువైన వస్తువులు రికవరీ చేశాము" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత సమాచారాన్ని చర్చించవద్దని డీసీపీ గులేద్ ప్రజలను హెచ్చరించారు.
Next Story