Sat Dec 21 2024 01:53:17 GMT+0000 (Coordinated Universal Time)
కల్తీ మద్యం కేసు : 40కి పెరిగిన మృతుల సంఖ్య
బీహార్ లో తూర్పు చంపారన్ జిల్లా మోతిహరిలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య నలభైకి చేరింది.
బీహార్ లో తూర్పు చంపారన్ జిల్లా మోతిహరిలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య నలభైకి చేరింది. ఈనెల 15న పలువురు స్థానికులు కల్తీ మద్యం తాగి అదే రోజు 20 మంది చనిపోయారు. మంగళవారానికి మృతుల సంఖ్య నలభైకి చేరింది. మరో 12 మంది మృత్యువుతో పోరాడుతున్నారు.
అధికారుల సస్పెన్షన్....
ఈ ఘటనకు సంబంధించి మొత్తంఐదు కేసులు నమోదయ్యాయి. కల్తీ మద్యం కేసులు పోలీసులు ఇప్పటి వరకూ174 మందిని అరెస్టు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పలువురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మద్య నిషేధం విధించిన తర్వాత కల్తీ మద్యం తాగి మరణించే వారి సంఖ్య బీహార్ లో ఎక్కువయింది.
Next Story