Tue Nov 05 2024 23:19:55 GMT+0000 (Coordinated Universal Time)
ఆన్ లైన్ గేమ్‌కు అలవాటు పడి ఆ యువతి ఏం చేసిందంటే?
హైదరాబాద్ లో ఆన్ లైన్ గేమ్స్‌తో యువతి అప్పులపాలయిన ఘటన వెలుగు చూసింది. డబ్బుకోసం సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది.
హైదరాబాద్ లో ఆన్ లైన్ గేమ్స్‌తో యువతి అప్పులపాలయిన ఘటన వెలుగు చూసింది. డబ్బుకోసం సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ జై భీమ్ న్యూస్ రాజేంద్రనగర్‌లో జరిగింది. డిగ్రీ చదువుతున్న ఒక యువతి కోసం తల్లిదండ్రులు ఆమెకు లాప్ ట్యాప్‌తో పాటు మొబైల్ ఫోన్ కొనిచ్చారు. వాటిని చదువు కోసం కాకుండా ఆన్ లైన్ గేమ్స్ కోసం వినియోగించింది. అయితే ఈ గేమ్ లో ఎక్కువగా డబ్బు నష్టపోవడంతో డబ్బుల కోసం ఆ యువతికి ఏం చేయాలో తెలియలేదు.
ఇంట్లో లేని సమయంలో...
దీంతో తల్లిండ్రులు ఇంట్లో లేని సమయంలోతన ఇంట్లోనే ఉన్న డబ్బును తస్కరించింది. దొంగలు పడి దోచుకుపోయినట్లు అక్కడ వస్తువులను చెల్లాచెదురు చేసి ఒక సీన్ క్రియేట్ చేసింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ ఇంట్లో దొంగతనం జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదని నిర్ధారించుకుని, యువతిని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
Next Story